రాజమండ్రి: జిల్లాలోని కోరుకొండ మండలం రాఘనపురం గ్రామ పరిధిలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న సమాచారంతో జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ విషయాన్ని జిల్లా మైన్స్ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి వెల్లడించారు. తనిఖీ సందర్భంగా అధికారులు అక్రమ తవ్వకాల కోసం ఉపయోగించిన గుంతలు, అలాగే టాటా హిటాచి (చైన్ మౌంటెడ్ పాన్) యంత్రాన్ని గుర్తించారు. అక్కడ ఉన్న ఆపరేటర్ మురమల్ల ప్రసాద్ (మోడకూరు పంచాయతీ, కొత్తపేట గ్రామం) ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.