పుష్కరాలు దృష్ట్యా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
NEWS Oct 16,2025 11:06 pm
రాజమండ్రి: రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా ఘాట్ల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు మరియు సురక్షత ఏర్పాట్లపై హేతుబద్ధమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ఆమె అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ — “రాజమండ్రి మరియు కొవ్వూరు డివిజన్ పరిధిలోని పుష్కరఘాట్ల వద్ద భక్తుల సౌకర్యం, శుభ్రత, రవాణా, భద్రత అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి,” అని పేర్కొన్నారు. ప్రతి శాఖ ప్రతిపాదించిన పనులను అనుసరించి బాధ్యతలను స్పష్టంగా కేటాయించి, పుష్కరాలు ప్రారంభమయ్యేలోగా అన్ని పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.