170 మంది మావోయిస్టులు లొంగుబాటు
NEWS Oct 16,2025 06:17 pm
మావోయిస్టులకు వరుసగా భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు పార్టీకి దశాబ్దాలపాటు అత్యంత కీలక నేతగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్‌రావు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ముందు లొంగిపోయిన మరుసటి రోజే మరో 170 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా Xలో పోస్టు పెట్టారు. నిన్న ఛత్తీస్‌గఢ్‌లో 27మంది; మహారాష్ట్రలో 61 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చారన్నారు. 2 రోజుల వ్యవధిలో 258 మంది లొంగిపోయారన్న అమిత్ షా.. నక్సలిజంపై పోరులో పెద్ద విజయమన్నారు.