నకిలీ మద్యం దోపిడీ కి టీడీపీ నాయకులు సహకారం
NEWS Oct 16,2025 11:04 pm
రాజమండ్రి: రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి నకిలీ మద్యం విక్రయాలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ నేతల బండారం బట్టబయలైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ — రాజమండ్రి అర్బన్, రూరల్ ప్రాంతాల్లో లిక్కర్ సిండికేట్‌గా వ్యవహరిస్తూ దోపిడీకి పాల్పడుతున్న టిడిపి నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మజ్జి రాంబాబు నకిలీ మద్యం సిండికేట్ వ్యవహారాలు నడుపుతున్నట్టు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని భరత్ రామ్ స్పష్టం చేశారు.