నకిలీ మద్యం గుర్తించేందుకు యాప్
NEWS Oct 16,2025 12:50 pm
రాజమండ్రి: ప్రస్తుత కాలంలో నకిలీ, కల్తీ మద్యపాన పదార్థాలు విస్తృతంగా లభ్యమవుతున్న నేపథ్యంలో, అబ్కారీ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “సురక్షా - ఏపీ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్” అనే మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా ప్రజలు తాము కొనుగోలు చేసిన మద్యం సీసాపై ఉన్న QR కోడ్ను స్కాన్ చేసి, ఆ మద్యం ప్రభుత్వ అనుమతితో విక్రయించబడినదా లేదా అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చని జిల్లా మద్యనిషేధ, అబ్కారీ అధికారి సీహెచ్. లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు.