రాజమండ్రి:ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైద్యాధికారులు పరస్పర సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ అధికారులతో సమగ్రంగా చర్చించారు.