కర్నూలు: నన్నూరులో \'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్\' బహిరంగసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఏపీ ఆత్మగౌరవం.. సంస్కృతికి నిలయంగా ఉందని అభివర్ణించారు. ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని, సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ యువశక్తి ఉందని నొక్కిచెప్పారు. చంద్రబాబు, పవన్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏపీకి సహకారం అందిస్తున్నామన్నారు. 16 నెలల్లో అభివృద్ధి డబుల్ ఇంజిన్‌లా దూసుకుపోతోందన్నారు.