విద్యార్థి వీక్షిత్ జన్మదినోత్సవం
వర్షకొండలో పండ్ల పంపిణీ కార్యక్రమం
NEWS Oct 16,2025 03:49 pm
ఇబ్రహీంపట్నం: ఎంపీపీఎస్ వర్షకొండ పాఠశాలలో తిథి భోజన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సిరికొండ వీక్షిత్ తల్లిదండ్రులు తమ కుమారుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయుడు అచ్చా విజయభాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రవళిక, శరణ్య, నవత, ఎండీఎం నిర్వాహకులు భూదమ్మ, లత, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.