వైద్య విధాన శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో
పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ
NEWS Oct 16,2025 03:16 pm
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన శాఖ కమిషనర్ అజయ్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, శుభ్రత, మందుల లభ్యత, సిబ్బంది హాజరు వంటి అంశాలను ఆయన తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి కమిషనర్ సూచించారు.