'మీ నాన్నలా తయారవుతావ్ లోకేశ్'
NEWS Oct 16,2025 01:15 pm
కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో ప్రధాని మోదీ మంత్రి అందరినీ పలకరిస్తున్నటైంలో మంత్రి నారా లోకేశ్‌ను చూసి ప్రత్యేకంగా మాట్లాడారు. "గతసారి చూసినప్పటికంటే ఇప్పుడు చాలా బరువు తగ్గావు" అంటూ లోకేశ్‌తో అన్నారు. ఆయన అంతటితో ఆగకుండా, "త్వరలోనే మీ నాన్నలా తయారవుతావు" అని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలతో అక్కడి వాతావరణం తేలికపడింది. ముఖ్యమంత్రితో పాటు అక్కడున్న ఇతర నేతలు కూడా నవ్వులు చిందించారు.