ఆహాలో లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4కు హాజరయ్యారు బ్రహ్మానందం. ఈ ఎపిసోడ్ లో బ్రహ్మానందం తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు. లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి హోస్ట్ అడగ్గా.. ఆయనతో ఎంతో పెద్ద అనుబంధం ఉంది.. కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న మనిషి, మంచి మనిషి బాలసుబ్రహ్మణ్యం అంటూ దుఃఖం ఆపులేక కన్నీళ్లు పెట్టుకున్నారు బ్రహ్మానందం.