మంత్రి కొండా సురేఖకు మరో షాక్
R&Bకి మేడారం జాతర పనులు!
NEWS Oct 16,2025 12:04 pm
కాంగ్రెస్ పార్టీలో మేడారం జాతర పనుల చిచ్చు రగులుతూనే ఉన్నది. తన శాఖలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అతిగా జోక్యం చేసుకుంటున్నాడని, మేడారం అభివృద్ధి పనులను ఆయన కంపెనీకి దక్కేలా చేసుకున్నాడని మంత్రి సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే. పొంగులేటిపై కాండా దంపతులు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే మంత్రుల మధ్య వివాదాలకు కారణమంటూ కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను ప్రభుత్వం ఉన్నఫలంగా తొలగించింది. అతనిని అరెస్టు చేసేందుకు ఏకంగా మంత్రి సురేఖ ఇంటికి అర్ధరాత్రి వేళ పోలీసులను పంపించింది. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే దేవాదాయ శాఖ మంత్రికి రేవంత్ రెడ్డి సర్కార్ షాకిచ్చింది.