ఏపీ పర్యటనలో ప్రధాని మోదీ
NEWS Oct 16,2025 11:57 am
ప్రధాని మోదీ ఏపీ పర్యటన కోసం విమానంలో కర్నూలు విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ స్వాగతం పలికారు. మోదీ కర్నూలు నుంచి సైనిక హెలికాప్టర్‌లో శ్రీశైలానికి వెళ్లారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సందర్శన తర్వాత, సమీపంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శించారు. కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుడతారు.