రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
NEWS Oct 16,2025 03:13 pm
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహ్మద్ జాఫర్ (41) అనే ఫిట్టర్ మృతి చెందారు. కొయ్యలగూడెంలో నివాసం ఉంటున్న జాఫర్, విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన మృతదేహం గుర్తుపట్టలేని విధంగా నుజ్జునుజ్జయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జాఫర్ మృతితో ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.