పోలీసులు ఆకస్మిక తనిఖీలు
NEWS Oct 16,2025 03:12 pm
మణుగూరు మండలం అశోక్ నగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్‌లో భాగంగా పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 58 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, ఒక ట్రాలీ, రూ.30 వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపులు నడిపిన నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు