ప్రధాని మోదీ పర్యటన ఇలా..
NEWS Oct 16,2025 12:27 am
ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలు విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుని అక్కడి నుంచి శ్రీశైల దేవస్థానానికి చేరుకుంటారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ప్రధాని మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కర్నూలు సభకు చేరుకుని సభలో పాల్గొంటారు. అనంతరం ప్రధాని హెలీకాప్టర్ ద్వారా కర్నూలు విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.