చిలకగెడ్డలో ప్రపంచ విద్యార్థుల దినోత్సవం
NEWS Oct 16,2025 11:00 pm
అనంతగిరి మండలం చిలకలగెడ్డ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఆవరణలో డా. అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిల్లో నోకుల్‌దాస్, ఉపాధ్యాయులు నరాజి మల్లేశ్వరరావు మాట్లాడుతూ — ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న భారత11వ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పీజే. అబ్దుల్ కలాం జన్మదినాన్ని దేశవ్యాప్తంగా జయంతి వేడుకలుగా జరుపుకుంటామని తెలిపారు. విద్యార్థులకు ప్రేరణనిచ్చే ఈ రోజు విద్యారంగ అభివృద్ధి, విజ్ఞాన ప్రగతి, యువతలో నిబద్ధతను పెంపొందించే దినంగా భావించబడుతుందని పేర్కొన్నారు.