క్యూలైన్‌లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
NEWS Oct 15,2025 04:28 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటి పరీక్షల కోసం వచ్చిన ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సాధారణ ప్రజల్లాగే క్యూ లైన్‌లో నిలబడి తన వంతు వచ్చాక పరీక్ష చేయించుకున్నారు. 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన నిరాడంబర జీవనశైలినే అనుసరిస్తున్నారు. సైకిల్‌పై ప్రయాణం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం ఆయనకు సాధారణం. వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు సైతం హంగామా జీవితం గడుపుతున్న ఈ రోజుల్లో, గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితం ప్రజల ప్రశంసలు అందుకుంది.