అక్కడ ₹17,000 తక్కువ ధరకే వెండి
NEWS Oct 15,2025 10:59 am
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో భారీ తేడాలున్నాయి. అహ్మదాబాద్‌లో కేజీ వెండి ₹1,90,000 ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో అది ₹2,07,000 ఉంది. అంటే ఏకంగా ₹17,000 వ్యత్యాసం ఉందన్నమాట. దీనిపై ఒక నెటిజన్ ‘అహ్మదాబాద్‌లో కొని ఇక్కడ అమ్మితే ఖర్చులు, ట్యాక్సులు పోనూ ₹14 వేలు మిగులుతాయి’ అని పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. అయితే ఇది రియాల్టీలో సాధ్యం కాదని, లీగల్ సమస్యలొస్తాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.