త్రిముఖ పోరులో గెలిచేదెవరు?
NEWS Oct 15,2025 03:35 pm
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ (కాంగ్రెస్), మాగంటి సునీత (BRS), దీపక్ రెడ్డి (BJP) బరిలోకి దిగారు. అధికార కాంగ్రెస్ తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తుండగా, BRS సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వ్యూహం రచిస్తోంది. ప్రభుత్వ పనితీరు, సానుభూతి, స్థానిక సమస్యల్లో ఏ అంశం ప్రభావం చూపుతుందనే చర్చ జరుగుతోంది. దీని ఫలితం గురించి రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.