మునిసిపల్ కమిషనర్‌గా రాహుల్ మీనా
NEWS Oct 15,2025 03:38 pm
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ (ఆర్ఎంసి) నూతన కమిషనర్‌గా రాహుల్ మీనా బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆర్ఎంసి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనా, ముందుగా కార్యాలయ ఆవరణలో ఉన్న శ్రీశ్రీశ్రీ అభయ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.