పశువులకు కాళ్లవాపు వ్యాధి నిరోధక టీకాలు
NEWS Oct 15,2025 03:41 pm
ఇబ్రహీంపట్నం: పశువుల ఆరోగ్య రక్షణలో భాగంగా కాళ్లవాపు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని పశువైద్యాధికారిణి డాక్టర్ శైలజ సూచించారు. ఫకీర్‌కొండాపూర్ గ్రామంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి 6 నెలలకు ఒకసారి పశువులకు టీకాలు వేయించుకోవాలని రైతులకు సూచించారు. గాలికుంటు వ్యాధి వల్ల కలిగే నష్టాలను వివరించారు. పశువైద్య సిబ్బంది జమున, రవితేజ, ప్రేమ్, గ్రామస్తులు దేవయ్య, శివ, వెంకట్, సాయన్న, వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.