రాష్ట్రాన్ని అప్పుల పాలుచేస్తున్న కూటమి ప్రభుత్వం: మార్గాని భరత్
NEWS Oct 15,2025 03:43 pm
రాజమండ్రి: కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, ఆస్తులను అమ్మేందుకు సిద్ధమైందని మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. స్థానిక మార్గాని ఎస్టేట్‌లో విలేకరులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ పథకాలను కాపీ చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించకపోగా, అన్నింటినీ ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని భరత్ ఆరోపించారు. తమ అనుకూల మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.