ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని ప్రకటన చేశారు. తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల కౌంటింగ్. బిహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.