జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్
NEWS Oct 15,2025 11:50 am
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి పేరును బీజేపీ ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.. ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్.. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకు పోతున్నారు.