మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర పోలీసుల ఎదుట ఉదయం లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. మరో 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మల్లోజుల నోటితో సాయుధ పోరాట విరమణ ప్రకటన చేయించారు. అనంతరం వీరంతా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. దేశాన్ని నక్సల్స్ ఫ్రీ భారత్‌గా నిర్మిస్తామని సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. ఐతే లొంగిపోయిన మావోయిస్టులకు భారత రాజ్యాంగం మరాఠీ ప్రతిని బహుకరించడం ఆసక్తిగా మారింది.