ప్రధాని మోడీ కర్నూలు పర్యటన ఖరారు
NEWS Oct 15,2025 12:06 am
AP: ఈ నెల 16న కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనపై PMO అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. 11.15 amకు శ్రీశైలం ఆలయంలో పూజలు చేసి, 12:15pmకు శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శిస్తారని పేర్కొంది. 2:30pmకు కర్నూలులో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపనతో సహా రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని తెలిపింది. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించింది.