TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. కార్యకర్తల్లో మరింత ఊపు తీసుకొచ్చి, ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీ చీఫ్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. నవంబర్ తొలి వారంలో ప్రచారానికి రానున్నారు. ఎర్రవల్లిలో పార్టీ అభ్యర్థి సునీతకు Bఫారమ్ ఇచ్చిన సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సభలోనా? లేక రోడ్ షోలో పాల్గొంటారనేది తెలియాల్సి ఉంది.