రాజమండ్రి: జర్నలిజంలో నైతిక విలువలు పాటిస్తూ, ఎందర్నో జర్నలిస్టులుగా ప్రోత్సహించిన సీనియర్ పాత్రికేయులు అడపా అప్పారావు మరణం జర్నలిజానికి తీరని లోటని పలువురు సీనియర్ పాత్రికేయులు కొనియాడారు. స్వర్గీయ అడపా అప్పారావు సంతాప సభ రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది. సభలో అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 2 నిముషాలు మౌనం పాటించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.