గుమ్మకోటలో పీఎం ఎంవివై కార్యక్రమం
NEWS Oct 14,2025 09:02 pm
అనంతగిరి (మం) గుమ్మకోట సచివాలయంలో పంచాయతీ సర్పంచ్ పాంగి అప్పారావు ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పౌష్టికాహార ప్రాముఖ్యత, ఓబిసిటీ నివారణ, పిల్లల ఎదుగుదల, గ్రామ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ పాత్రపై వివరాలు తెలియజేశారు. అలాగే పథక లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు వివరించారు. అంగన్వాడీ సూపర్‌వైజర్ జి. కృష్ణవేణి, ఉపసర్పంచ్ కన్నయ్య, కార్యదర్శి ధర్మ, రెవిన్యూ అధికారి కోటిబాబు, వెలుగు సీసీ త్రినాధ్, మహిళా పోలీస్, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పిల్లల తల్లులు పాల్గొన్నారు.