జీఎస్టీ తగ్గడంతో పేదలకు మేలు: రమేష్
NEWS Oct 14,2025 08:58 pm
అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో గ్రామ సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బొర్రా జంక్షన్, ముల్యాగూడ కిరాణా షాపుల వద్ద ప్రజలకు జీఎస్టీ సేవింగ్స్ ప్రయోజనాలు వివరించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల పేద ప్రజలకు గణనీయమైన ఉపశమనం లభిస్తోందని డిజిటల్ అసిస్టెంట్ సారంగి రమేష్ తెలిపారు. సచివాలయ సిబ్బంది, టోకూరు టీడీపీ యువ నాయకుడు మోహన్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.