ఉపాధి హామీ సభలో స్త్రీనిధి పోస్టర్ లాంచ్
NEWS Oct 14,2025 08:56 pm
అనంతగిరి మండలంలోని గుమ్మకోట సచివాలయంలో సర్పంచ్ పాంగి అప్పారావు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా వెలుగు సిసి త్రినాథ్ స్త్రీనిధి పోస్టర్‌ను సర్పంచ్ పాంగి అప్పారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం సచివాలయ పరిధిలోని ఐదు గ్రామ సంఘాల సభ్యులకు స్త్రీనిధి రుణాల వివరాలు, 2025 ఏప్రిల్ నుండి ఇప్పటివరకు ఇచ్చిన బ్యాంకు రుణాల సమాచారం అందజేశారు. సంఘాలలో పుస్తక నిర్వహణ కోసం ఈ-నారి, మన డబ్బులు - మన లెక్కలు కార్యక్రమాల ప్రాధాన్యం గురించి అధికారులచే సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రాజకీయ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ సంఘం వీవోఏలు పాల్గొన్నారు.