కల్తీ మద్యం లేదు: ఎక్సైజ్ అధికారిణి లావణ్య
NEWS Oct 14,2025 03:24 pm
జిల్లాలో కల్తీ మద్యం అమ్మకాలు ఎక్కడా జరగలేదని జిల్లా ఎక్సైజ్ అధికారిణి లావణ్య తెలిపారు. ఈనెల 13న వైసీపీ నాయకులు కల్తీ మద్యం పై అందించిన వినతి మేరకు జిల్లా పరిధిలోని 138 మద్యం దుకాణాలు, 20 బార్లలో 574 శాంపిల్స్ సేకరించి ల్యాబ్ లో పరిశీలించగా కల్తీ మద్యం అనవాళ్ళు లభించలేదని చేశారు. ఎక్కడైనా కల్తీ మద్యం అమ్మకాలు జరిపితే 14405 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.