అఫ్గాన్ - పాక్ మధ్య హోరాహోరీ పోరు
NEWS Oct 14,2025 06:59 pm
పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ మధ్య మళ్లీ హోరాహోరీ ఘర్షణ తలెత్తింది. ఇరుదేశాల సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. పాక్ తమ పౌరులను టార్గెట్ చేసుకొని కాల్పులు జరుపుతోందని అఫ్గాన్ ఆరోపించింది. ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారని వివరించింది. తమ సైన్యం కూడా దీటుగా బదులిస్తోందని పేర్కొంది. కాగా ఇటీవల జరిగిన కాల్పుల్లో 58 మంది పాక్ సైనికులు మరణించినట్లు అఫ్గాన్ ప్రకటించడం తెలిసిందే.