క్రీడల్లో ఆణిముత్యం చిన్నారి తన్య
NEWS Oct 14,2025 01:41 pm
అరకువాలీ (మం) లిట్టిగూడ గ్రామానికి చెందిన కొర్ర జీవన తన్య (8) క్రీడల్లో ప్రతిభ చాటుతోంది. శారద నీకెతన్ పాఠశాల 3వ తరగతి చదువుతున్న జీవన తన్య, వ్యవసాయ కూలీ అయిన తండ్రి కొర్ర బాబురావు కూతురు. విశాఖపట్నంలో నిర్వహించిన నేవీ మారథాన్ 5 కిలోమీటర్ల రన్‌లో బంగారు పతకం సాధించి తొలి స్థానం దక్కించుకుంది. అదేవిధంగా అరకు చలి ఉత్సవ 5కే రన్, తలసీమ రన్ 5కే రన్‌ల్లోనూ తొలి స్థానాలు గెలుచుకుంది. అలాగే యూత్ ఫెస్టు మారథాన్ 5కే రన్‌లో 2వ స్థానం సంపాదించింది. చిన్న వయసులోనే క్రీడా రంగంలో మెరుస్తున్న జీవన తన్యకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు.