రాజవోలులో YCP లక్షా సంతకాల సేకరణ
NEWS Oct 14,2025 07:05 pm
నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని తూర్పుర పట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ రాజవోలు వద్ద నిర్వహించిన “లక్షా సంతకాల సేకరణ” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు కూటమి ప్రభుత్వ వాగ్దానాల వాస్తవాలు తెలియజేయడం వైఎస్సార్‌సీపీ కార్యకర్తల బాధ్యత అని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఈ మోసాన్ని వివరించి, ప్రజల మద్దతు తిరిగి సంపాదించాలని ఆయన పిలుపునిచ్చారు.