MTV మ్యూజిక్ ఛానల్స్‌కు గుడ్‌బై
NEWS Oct 14,2025 03:30 pm
టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రాకముందు యూత్‌కు వినోదాన్ని పంచడంలో MTV ముందుండేది. స్కూల్, కాలేజ్ నుంచి రాగానే ఆ మ్యూజిక్ ఛానల్స్ ఆన్‌చేసి పాటలు వింటూ ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు ఈ ఛానల్ బ్యాడ్‌న్యూస్ తెలిపింది. తమ మ్యూజిక్ ఛానళ్లను మూసివేస్తున్నట్లు MTV యాజమాన్యం ప్రకటించింది. ‘ఎంటీవీ 80’, ‘ఎంటీవీ మ్యూజిక్’, ‘క్లబ్ ఎంటీవీ’, ‘ఎంటీవీ 90’, ‘ఎంటీవీ లైవ్’ ఛానళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 31 నుంచి ఆయా ఛానళ్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండవని తెలిపింది.