విశాఖ ఏఐ హబ్‌పై గూగుల్ కీలక ప్రకటన
NEWS Oct 14,2025 02:15 pm
గూగుల్, విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి AI హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. రాబోయే ఐదేళ్లలో రూ.1,33,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు. అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ కేంద్రం ఇదే. ఈ చరిత్రాత్మక ఒప్పందంపై ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్‌లో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధులు సంతకాలు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్‌తో పాటు గూగుల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.