విశాఖలో గూగుల్ ఏఐ హబ్‌కు ఒప్పందం
NEWS Oct 14,2025 12:51 pm
ఏపీ ప్రభుత్వం, టెక్ దిగ్గజం గూగుల్‌తో కలిసి విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్, నారా లోకేశ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. సుమారు ₹88,628 కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ “గూగుల్ ఏఐ హబ్” భారతదేశపు తొలి AI కేంద్రంగా నిలుస్తుంది. ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.88 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖ “ఏఐ సిటీ”గా రూపాంతరం చెందుతుందని ప్రభుత్వం ప్రకటించింది.