భక్తుల మనోభావాలను గౌరవించాలి
NEWS Oct 14,2025 01:02 pm
స్థానిక ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి భక్తుల మనోభావాలను ప్రతిబింబించే విధంగా పాలక మండలి నిర్వహించాలి అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. దేవాదాయ శాఖ ఆధీనంలోని ఈ దేవస్థానానికి ఇటీవల నియమించబడిన కొత్త పాలక మండలి సభ్యులు తిలక్ రోడ్‌లోని నగర టీడీపీ కార్యాలయం లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మళ్ల వెంకటరాజు, నక్కెళ్ల హరి ప్రసాద్, కోల రామచంద్రరావు, పెండ్యాల ఉమామహేష్, శీలం సత్యనారాయణ, కొప్పల రామేశ్వరి, తంగెళ్ళ పద్మావతి, కల్లూరి సూర్యనాగ వెంకట అన్నపూర్ణ తదితరులను ఎమ్మెల్యే అభినందించారు.