మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
NEWS Oct 14,2025 08:33 am
మక్క కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు పిడుగు ప్రతాప్ రెడ్డి తెలిపారు. రానున్న కాలంలో వర్షపాత నమోదు కారణంగా రైతులు నష్టపోతారని, ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. వర్షాలు పడితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఆరుకాలం శ్రమించిన పంట చేతికొచ్చినా పంట నాశనం అవుతుందని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమని అన్నారు. ముందస్తు చర్యలు తీసుకొని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.