మావోయిస్టు అగ్రనేత మల్లోజుల సరెండర్
NEWS Oct 14,2025 12:21 pm
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ 60 మందితో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరౌలి పోలీసులు ఎదుట లొంగిపోయారు. పార్టీ ప్రస్తుత విధానాలపై అసంతృప్తితో లేఖ రాసి, ఆయుధాలు వీడాలని పిలుపునిచ్చిన మల్లోజుల నిర్ణయం మావోయిస్టుల్లో కలకలం రేపింది. నంబాల కేశవరావు మరణం తర్వాత సుప్రీం కమాండర్ రేసులో ఉన్న ఆయన అకస్మాత్తుగా లొంగిపోవడం పార్టీకి పెద్ద దెబ్బ. ఇదే సమయంలో ఆయన సోదరుడు కిషన్ జీ గతంలో ఎన్‌కౌంటర్లో చనిపోగా, భార్య మైనక్క ఇటీవల లొంగిపోయారు.