రాజమండ్రిలో ఉచిత కాలేయ వైద్య శిబిరం
NEWS Oct 14,2025 01:59 pm
రాజమండ్రి: లివర్ పాడకానికి ప్రధాన కారణాలుగా అల్కాహాల్ సేవ, హెపటైటిస్ బి, సీ వైరస్ ఉంటాయని యశోద హాస్పిటల్స్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, సేవ్ లివర్ ఫౌండేషన్ నిర్వాహకుడు డాక్టర్ సోము శేఖర్ తెలిపారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కాలేయ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ శేఖర్ రోగులను పరిశీలించి, వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. ట్రస్ట్ నిర్వాహకులు పంతం కొండలరావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాజమండ్రి జనసేన ఇన్చార్జి అత్తి సత్యనారాయణ, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రోటరీ క్లబ్ వెంకటరావు పాల్గొన్నారు. డాక్టర్ శేఖర్ సూచనల ప్రకారం, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మితంగా మద్యం సేవించడం, హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం అవసరం అని తెలిపారు.