మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు
NEWS Oct 14,2025 11:30 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీని తన మంచి స్నేహితుడిగా పేర్కొంటూ, “ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారు” అని ఈజిప్టులో ప్రశంసించారు. గాజా శాంతి ఒప్పందం సంతకోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మోదీ, ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడి శాంతి ఒప్పందానికి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ భారత పర్యటనలో ప్రధాని మోదీతో భేటీ అయ్యి, ట్రంప్ సంతకంతో ఉన్న ఫోటోను బహుమతిగా అందించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని గోర్ తెలిపారు.