బాపట్ల జిల్లాలో జరిగిన 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తైక్వాండో పోటీలలో రైల్వేకోడూరు విద్యార్థిని టి. సోహిత అండర్-14 విభాగంలో బంగారు పతకం సాధించింది. అక్టోబర్ 10 నుంచి జరిగిన ఈ పోటీలలో ఆమె ప్రతిభ మెరిపించి జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యింది. ఈ సందర్భంగా ఎస్‌కె స్పోర్ట్స్ అకాడమీ కోచ్ మౌల ఆమె విజయాన్ని ప్రశంసించారు.