భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
NEWS Oct 14,2025 11:24 am
దీపావళి ముంగిట బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 3,280 పెరిగి రూ.1,28,680కు చేరింది. 10 రోజుల్లోనే రూ.9,280 పెరగడం గమనార్హం. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,000 పెరిగి రూ.1,17,950గా ఉంది. అలాగే కేజీ వెండిపై రూ.9,000 ఎగబాకి తొలిసారి రూ.2,06,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.