పెట్రోల్ బంకు తనిఖీ చేసిన తహశీల్దార్
NEWS Oct 14,2025 11:21 am
దేవరపల్లి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్‌లో అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తహసీల్దార్ పి. లక్ష్మీదేవి, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ రవి కలిసి బంక్ రికార్డులు, ఇంధన నిల్వలు, విక్రయాల వివరాలను సమగ్రంగా పరిశీలించారు. నిబంధనలను ఉల్లంఘించినా, తప్పుడు కొలతలతో లేదా నాసిరక ఇంధన విక్రయాలు చేసినా కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. వినియోగదారుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, తాగునీరు, ఉచిత ఎయిర్ ఫిల్లింగ్ వంటి ప్రాథమిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. నాణ్యమైన సేవలు అందించడం ప్రతి బంక్ నిర్వాహకుడి బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.