చోడవరం: 275 కిలోల గంజాయి పట్టివేత
NEWS Oct 14,2025 11:15 am
చోడవరం మండలంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. టాటా కర్వ్ వాహనంలో తరలిస్తున్న 275 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.13.75 లక్షలుగా అంచనా. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ను ఎస్పీ తుహిన్ సిన్హా మరియు డీఎస్పీ శ్రావణి పర్యవేక్షించారు. పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.