చిరుని కలిసిన రామచందర్ రావు ఫ్యామిలీ
NEWS Oct 14,2025 12:54 am
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తన మనవరాలి కోరిక మేరకు ఆమెతో కలిసి చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న రామచందర్ రావు మనవరాలు ఐరా ఆశీష్ భారత్‌కు వచ్చారు. చిరంజీవిని కలవాలన్న ఆమె ఆకాంక్ష మేరకు, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి షూటింగ్ స్పాట్‌కు వెళ్ళి కలిశారు. ఈ విషయాన్ని రామచందర్ రావు X వేదికగా తెలియజేశారు. అక్కడ హీరోయిన్ నయనతారను కూడా కలిశారు.