రెడీ టూ సర్వ్ ఓల్డ్ ఏజ్ హోంలో
మధుసూదనాచారి జన్మదిన వేడుకలు
NEWS Oct 13,2025 08:35 pm
శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి జన్మదిన వేడుకలు వనస్థలిపురంలోని ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోంలో వృద్ధుల సమక్షంలో ఘనంగా జరిగింది. మధుసూదనాచారి తనయుడు శివ ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మధుసూదనాచారి తరుపున వృద్ధులకు అన్నం, పండ్లు, రొట్టెలు, దుప్పట్లు అందజేశారు. అలాగే, ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వహణకు వారు తమవంతు సహాయ సహకారం అందిస్తామని ఆశ్రమ నిర్వాహకులు పెద్ది శంకర్‌కి తెలిపారు.